నారా లోకేష్ కాన్వాయ్ లో ప్రమాదం.. అంతా సేఫ్!

  • నెల్లూరు నుంచి తిరుపతి బయలుదేరిన లోకేష్
  • సెక్యూరిటీ వాహనాలు ఢీ
  • తిరుపతి చేరుకున్న లోకేష్
'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా తన నెల్లూరు పర్యటనను ముగించుకుని, ఏపీ మంత్రి నారా లోకేష్ బయలుదేరిన వేళ, ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి బయలుదేరిన కాన్వాయ్ లో వెనక వస్తున్న సెక్యూరిటీ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో రెండు ఎస్కార్ట్ వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద తీరును పరిశీలించిన అనంతరం లోకేష్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన క్షేమంగా తిరుపతి చేరుకున్నారు.
Go Back to Shorts
Nellore
Nara Lokesh
Security Vehicles

More Telugu News